శ్రావణ మాసంలో ఈ మొక్కను ఇంట నాటితే లక్ష్మీదేవి పొమ్మన్నా పోదట..

మొక్కల వలన లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని మొక్కలు మనకు మంచి ఆక్సీజన్‌ను అందిస్తాయి. కొన్ని మొక్కలు ఇంట్లో పాజిటివిటీని పెంపొందిస్తాయట. మరికొన్ని మొక్కలు లక్ష్మీదేవిని మన ఇంటకి రప్పిస్తాయట. ఇక వచ్చేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఓ మొక్కను మన ఇంట్లో నాటితే లక్ష్మీదేవి పొమ్మన్నా ఇల్లు వదిలి పోదట. సంపద పెరుగుతూనే ఉంటుందట. అపారమైన ఆర్థిక లాభాలను తెచ్చి పెడుతుందట. ఇంతకీ ఏంటా మొక్క అంటారా? మనీ ప్లాంట్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకునేది మనీ ప్లాంట్ గురించి కాదులెండి.

శమీ మొక్క. ఇది ఇంటి ఆవరణలో నాటితో శని దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందట. ఏలిన నాటి శని ఏడేళ్లని అంటారు. శమీ మొక్కను ప్రతి రోజూ పూజిస్తే శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదట. బ్యాంక్ బ్యాలెన్స్.. సంపద పెరుగుతూనే ఉంటుందట. అయితే ఈ మొక్కను శ్రావణ శనివారం నాటితే మరింత ఉపయోగం ఉంటుందట. ప్రతిరోజూ ఉదయం శమీ మొక్కకు నీళ్లు పోసి.. సాయంత్రం ఆవనూనెతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలనేవే ఉండవట. ఉద్యోగ సమస్యలతో పాటు ఇతర సమస్యల నుంచి కూడా గట్టెక్కుతామట.

Share this post with your friends