ఈ పువ్వులు మీ ఇంట వికసిస్తే సంపద పెరుగుతుందట..

హిందువులు దాదాపుగా అన్ని విషయాల్లో శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట ఉంటే మంచిది.. మరికొన్ని వస్తువులు ఇంట ఉండకుంటే మంచిదని భావిస్తారు. అలాంటి వాటిలో కలబంద మొక్క ఒకటి. కలబంద మొక్కే కాదు.. దాని పువ్వు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. కలబంద పూలు పూస్తే అవి అదృష్టానికి సంకేతంగా చెబుతారు. అలాంటి కలబంద పువ్వులు ఎప్పుడు పడితే అప్పుడు పూయవు. వాటికి కూడా అనుకూలమైన వాతావరణ పరిస్థితులుంటాయి. మీ ఇంట్లో కలబంద పువ్వు పూయాలనుకుంటే దానికి సూర్యరశ్మి సమృద్ధిగా ప్రసరించే ప్రదేశంలో పెంచాలి.

కలబంద మొక్కకు పువ్వులు పూసి అవి వికసిస్తే శుభసూచికంగా భావిస్తారు. ఆ పువ్వు ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుందట. తద్వారా మన ఇంట ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. మరి కలబంద మొక్క పూలు పూయాలంటే సూర్యరశ్మి చాలా అవసరం కాబట్టి ఎండ తగిలే ప్రదేశంలో మాత్రమే దీనిని పెంచాలి. కొంతమంది కలబంద మొక్కలను ఇంటి లోపల కూడా పెంచుతారు. కానీ ఇంటి లోపల పెంచితే పువ్వులను మాత్రం ఇది పూయదు. కలబంద మొక్క కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇది అత్యంత ఎక్కువగా ఆక్సిజన్‌ను అందించే మొక్కల్లో ఇదొకటి. కానీ, అవి పెరిగి పూలు వికసించే అవకాశం ఉండదు. శాస్త్రం ప్రకారం..కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి.

Share this post with your friends