శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ముందుగా మనకు గుర్తొచ్చేది వరలక్ష్మీ వత్రం. ఈ వ్రతాన్ని దాదాపు మహిళలంతా ఆచరిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది 16న వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోనున్నాం. ఇప్పటికే మహిళలంతా ఈ వ్రతం కోసం ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. అమ్మవారి ప్రతిమ, అలంకరించే వస్తువులన్నింటినీ తెచ్చి పెట్టుకుంటున్నారు. అయితే అమ్మవారి ప్రతిమతో పాటు ఇంకొక బొమ్మను కూడా పెడితే మన ఇంట సిరుల పంట పండటం ఖాయమట. మరి ఆ బొమ్మేంటో తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని మనం సర్వాంగ సుందరంగా అలంకరిస్తూ ఉంటాం. ఆ తరువాత అమ్మవారికి ఇరువైపులా రెండు ఏనుగు బొమ్మలను సైతం పెట్టాలట. అలా పెడితే మన ఇంట కాసుల వర్షం ఖాయమట. అమ్మవారికి ఏనుగు అంటే చాలా ఇష్టమట. కాబట్టి ఏనుగు బొమ్మలను రెండింటిని అమ్మవారి చిత్రపటం లేదంటే విగ్రహానికి రెండు పక్కలా పెడితే సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతామట. దీంతో మనకు అన్ని విధాలుగా కలిసొస్తుందని నమ్మకం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మరీ మంచిదట. అలాగే ఆవు నెయ్యితో తయారు చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.