గంట కొడితే ఇక్కడి చిన్ని కన్నయ్య భయపడతాడట..

మన దేశంలో హిందూ ఆలయాలకు కొదువేమీ లేదు. వాటిలో కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకం. వాటిలో ఒకటి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం. ఈ ఆలయ రహస్యాలు ఎవరికీ అంతుబట్టవు. బాంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బాలుడి రూపంలో కొలువై ఉంటాడు. ఇక్కడి బాలకృష్ణుని భక్తిశ్రద్ధలతో సేవిస్తే.. భక్తుల కోరికలు నెరవేరి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని నమ్మకం. ఈ ఆలయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో గంటలు అనేవి మనకు కనిపించవు. అదొక్కటేనా? భజనలు, కీర్తనల వంటివి కూడా మనకు ఎప్పుడూ వినిపించవు.

ఇక్కడ ఎవరూ పెద్దగా పాటలు పాడటమో.. స్వామివారికి హారతి ఇవ్వడమో చేయరు. ఇదంతా ఎందుకు అంటారా? స్వామివారి పట్ల భక్తులకు ఉన్న ప్రేమ. అందుకే కన్నయ్యను లేపేందుకు ఎలాంటి శబ్దమూ చేరు. స్వామివారిని మెల్లగా మేల్కొల్పుతారు. చిన్న పిల్లవాడిని చూసినట్టుగానే చూస్తారు. పెద్దగా గంట కొడుతూనో.. లేదంటే పాట పాడుతూనే నిద్ర లేపితే చిన్నికన్నయ్య ఉలిక్కి పడతాడని.. భయపడి ఏడుస్తాడని ఇక్కడి వారు భావిస్తారట. అందుకే ఈ ఆలయంలో గంటలు కూడా ఉండవు. ఒక్కసారిగా గంట కొడితే చిన్న కన్నయ్య భయపడతాడని గంటలు తీసేశారట.

Share this post with your friends