ఆ స్తంభం గుహ గోడను తాకితే కలియుగ అంతం తప్పదట..

శివుడు వినాయకుడి తలను ఖండించిన గుహ గురించి మనం ముందే తెలుసుకున్నాం. ఈ గుహ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో ఓ పర్వతంపై ఉంది. ఈ గుహ ఎత్తు 90 అడుగులు ఉంటుంది. ఈ గుహ పాతాళ భువనేశ్వర గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహలో విశేషాలు చాలా ఉన్నాయి. నాలుగు యుగాలకు ప్రతీకగా ఈ గుహలో మొత్తం నాలుగు రాతి కట్టడాలున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. వాటిలో ఒక స్తంభం పైకి క్రమంగా లేస్తూ ఉంటుంది. ఈ స్తంభాన్ని కలియుగానికి చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ స్తంభం ప్రతి వెయ్యి ఏళ్లకోసారి పెరుగుతూ ఉంటుందని స్థానికులు చెబుతారు.

అలా స్తంభం పెరుగుతూ పెరుగుతూ గుహ గోడను ఎప్పుడైతే తాకుతుందో ఆ రోజు కలియుగం అంతమవుతుందని చెబుతారు. అయితే ఈ పాతాళ గుహలో వినాయకుడు మాత్రమే కాదు. శివుడితో సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు. ఈ గుహలో మనకు బద్రీనాథ్‌ కనిపిస్తుంది. ఈ బద్రీనాథ్‌లో యమ కుబేరుడు, వరుణుడు, లక్ష్మి, గరుత్మంతుడు, గణేశుడు వంటి రాతి శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. అలాగే ఈ గుహలో కేదార్‌నాథ్, అమర్‌నాథ్ కూడా కనిపిస్తాయి. స్కాందపురాణంలోని మానస విభాగంలో ఈ గుహ గురించి ప్రస్తావన ఉంది.

Share this post with your friends