తిరుమల శ్రీవారిని కాలినడకన చేరుకునేందుకు రెండు మార్గాలున్నాయి. వాటిలో అలిపిరి మెట్ల మార్గం ఒకటైతే.. శ్రీవారి మెట్టు మార్గం మరొకటి. శ్రీవారి మెట్టు మార్గాన్నే సిద్ధుల దారి అని కూడా పిలుస్తారు. ఇది చాలా చిన్న దారి. అందుకే దీనిని దగ్గర దారి అని కూడా పిలుస్తారు. ఈ దారిలో మొత్తంగా 2388 మెట్లు ఉంటాయి. 2.1 కి.మీ మాత్రమే దూరం ఉంటుంది. ఈ మార్గంలో తిరుమలను చేరుకునేందుకు దాదాపు గంటన్నర సమయం మాత్రమే పడుతుంది.

ఈ దారికి సంబంధించిన పురాణ కథ ఏంటంటే.. శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా వైకుంఠం నుండి ఈ దారిలోనే తిరుమల కొండపైకి దిగాడు. అందుకే దీనికి “శ్రీవారి మెట్టు” అని పేరు. సిద్ధులు, యోగులు తపస్సు కోసం ఈ దారిలోనే వెళ్లేవారు.
మార్గంలో ముఖ్యమైన ప్రదేశాలు:
– శ్రీనివాస మంగాపురం: ఇక్కడి నుంచి మెట్లు మొదలవుతాయి.
– 1200వ మెట్టు: ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది.
– 2000వ మెట్టు: ఇక్కడ హనుమంతుడి గుడి ఉంది. కాసేపు కూర్చుని వెళ్తారు.
మెట్ల మార్గం నియమాలు – విశేషాలు
– టోకెన్ దర్శనం: నడిచి వెళ్లే భక్తులకు అలిపిరి, శ్రీవారి మెట్టు దగ్గర “దివ్య దర్శనం” టోకెన్లు ఇస్తారు. దీంతో త్వరగా దర్శనం అవుతుంది.
– కాళ్లకు నీళ్లు: మార్గమంతా కుళాయిలు, తాగడానికి నీళ్లు, మజ్జిగ ఉంటాయి. TTD వాళ్లు ఫ్రీగా ఇస్తారు.
– రాత్రి ప్రయాణం: రాత్రి 12 గంటల వరకు అనుమతిస్తారు. మార్గమంతా లైట్లు, సెక్యూరిటీ ఉంటుంది.
– మెట్లకు పసుపు-కుంకుమ: భక్తులు ప్రతి మెట్టుకూ పసుపు, కుంకుమ రాస్తారు. నామాలు రాస్తారు.
– నామస్మరణ: మెట్లు ఎక్కేటప్పుడు “గోవిందా గోవిందా”, “ఏడుకొండలవాడా వెంకటరమణా” అని జపిస్తూ వెళ్తారు. అలసట తెలియదు.
