తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధులకు ఆ పేరెలా వచ్చింది?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలను భూలోక వైకుంఠంగా పేర్కొంటారు. తిరుమలలో ప్రతి దానికి ఒక్కో పేరు ఉంది. శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ తిరుమల భక్తులకు పరమ పవిత్రమైన ప్రదేశం. అందుకే శ్రీ మలయప్పస్వామి అర్చావతారంగా వెలసిన గర్భాలయాన్ని ఆనంద నిలయంగా పిలుస్తారు. శ్రీనివాసుని ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులుంటాయి. వాటిని మాడ వీధులుగా పేర్కొంటారు. ఈ మాఢవీధులలో చెప్పులతో ఎవరూ తిరగకూడదన్నది నిబంధన.

తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధులకు ఆ పేరెలా వచ్చింది?
తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధులకు ఆ పేరెలా వచ్చింది?

శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజూ జరిగే ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు మొదలుకుని ఇతర సేవల్లో మలయప్పస్వామి తన ఉభయ దేవేరులతో కలిసి ఈ మాడ వీధుల్లోనే ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతటి పవిత్రమైన ఈ మాడ వీధుల్లోఎవరూ పాదరక్షలు ధరించకూడదన్నది ఆలయ సంప్రదాయం. అసలు ఇంతకూ ఈ మాడ వీధులకు అంతటి పవిత్రత ఎలా వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్లు ఉన్న ప్రాంతమంతా పరమ విత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఆ వీధులను తమిళంలో మాడాంగా పిలుస్తారు. ద్రవిడ సంప్రదాయం అధికంగా ఉన్న తిరుమలలో ఈ ‘మాడాం’ అనే పదం కాలక్రమేణా మాడవీధులుగా మారింది.

Share this post with your friends