వీకెండ్స్‌లో పంచముఖ ఆంజనేయుడిని ఎలా పూజించాలంటే..

ఆంజనేయుడికి ఐదు ముఖాలు పంచ భూతాలను, ఐదు దిక్కులను సూచించడంతో పాటు అసాధారణతను సూచిస్తుంది. ఈ ఐదు ముఖాలు హనుమంతుడు, నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడ. ప్రతి ముఖం విభిన్న లక్షణాలను సూచిస్తుంది. అలాగే పంచుముఖ ఆంజనేయుడు ఎనిమిది సుగుణాలను కలిగి ఉంటాడు. అవేంటంటే.. హనుమంతుడు తెలివితేటలు, చాకచక్యానికి ప్రతీక, నరసింహుడు ధైర్యం, పరాక్రమానికి ప్రతీక, వరాహుడు ధైర్యాన్ని, హయగ్రీవుడు జ్ఞానం , అభ్యాసానికి ప్రతీక. గరుడుడు ఎనిమిది సుగుణాలను ప్రసాదిస్తాడని అంటారు.

పంచముఖి ఆంజనేయుని ఐదు ముఖాలు పంచ భూతాలను, ఐదు దిక్కులను సూచిస్తాయని చెబుతారు. పురాణాల ప్రకారం హనుమంతుడు పాతాళంలోని మహిరావణం చేర నుంచి రాముడు, లక్ష్మణులను విడిపించడానికి ఆంజనేయుడు పంచభూతాలను అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమిని తనయందు నిక్షిప్తము చేసికొని ఐదు ముఖాలతో పంచముఖ ఆంజనేయునిగా అవతారమెత్తెను.తూర్పుముఖముగా ఆంజనేయుడు, దక్షిణ ముఖముగా సింహం ముఖం , పశ్చిమ ముఖముగా గరుడుని ముఖం, ఉత్తర దిశగా వరాహావతారం, ఊర్ధ్వ దిశగా హయగ్రీవముఖం కలిగి ఉన్నాడు. పంచముఖ ఆంజనేయుడి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందట. ముఖ్యంగా శని, మంగలవారాల్లో పంచముఖ ఆంజనేయుడికి తమలపాకుల మాల, వెన్న సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం.

Share this post with your friends