దుర్గమ్మను జమ్మి ఆకులతో ఎలా పూజించాలి?

జమ్మి చెట్టు మన ఇంట ఉంటే చాలా మంచిదని చెబుతారు. ఇంట్లో ఉంటే నిత్యం జమ్మి చెట్టును పూజించుకుంటే మన ఇంట కష్టాలన్నీ తీరిపోయి సంతోషం నెలకొంటుందట. ముఖ్యంగా విజయ దశమి రోజున మనం జమ్మి చెట్టును తప్పక పూజిస్తాం. ఆ రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టుని పూజించాలి. దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పిస్తే మన కుటుంబం అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతుందట. దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకులను సమర్పించడం వలన మన సమస్యలన్నీ తీరిపోతాయట.

ఇక అమ్మవారిని జమ్మి ఆకులతో ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. సర పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా అమ్మవారిని జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం, కుంకుమని పెట్టాలి. ఆ తరువాత మన మనసులో కోరికను అమ్మవారికి తెలియజేయాలి. అనంతరం అమ్మవారిని ధ్యానిస్తూ దుర్గమ్మకు జమ్మి పత్రాలను తలపై సమర్పించాలి. అలాగే గణేషుడికి సైతం జమ్మి ఆకులను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, శని దోషాలు పోతాయని నమ్మకం.

Share this post with your friends