మనస్సును అంతర్ముఖం చేయడం ఎలా?

మనస్సును అంతర్ముఖం చేయడం అంటే బయటి ప్రపంచం నుంచి దృష్టిని మరల్చి, అంతర్గత భావాలు, ఆత్మపై కేంద్రీకరించడం వంటివి చేయడం. దీనికి కొన్ని పద్ధతులు సహకరిస్తాయి. ప్రాణాయామం, ధ్యానం, సద్గ్రంథ పఠనం, మౌనం, మరియు నిశ్శబ్దంగా ఒకచోట కూర్చోవడం వంటి పద్ధతులు సహాయపడతాయి.

మనస్సును అంతర్ముఖం చేయడం ఎలా?
మనస్సును అంతర్ముఖం చేయడం ఎలా?

01. మున్ముందుగా పరిమిత సాత్త్వికాహారం తీసుకోవాలి.
02. లౌకిక వ్యవహారాలు, కోరికలు తగ్గించుకోవాలి.
03. సద్గ్రంథ పఠన, ఇష్ట దేవతారాధన పెంచుకోవాలి.
04. వైరాగ్యం అలవరచుకోవాలి.
05. యోగ ప్రక్రియలలో ధ్యానాభ్యాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
06. అన్నింటికీ మించి మనస్సు అంతర్ముఖం కావటం లేదే అనే ఆరాటాన్ని తగ్గించుకోవాలి.

అదే సమయంలో లక్ష్య సిద్ధికై అకుంఠిత ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇది ఒక అసిధారా వ్రతం వంటిది. దీనిలో నెగ్గిన వారికే అంతర్ముఖత్వం సులభ సాధ్యం అవుతుంది.

Share this post with your friends