
నిర్జల ఏకాదశి నాడు తులసితో చేసే పరిహారాల కారణంగా ఎంత మంచి జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరి తులసితో పరిహారాలు ఎలా చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటాం. ఈ పూజ పూర్తైన మీదట తులసి మొక్క దగ్గర అంతా శుభ్రం చేసి దీపం వెలిగించాలి. ఆ తరువాత తులసి మొక్కకు ఎరుపు రంగు కండువాను సమర్పిస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట.
నిర్జల ఏకాదశి రోజున తిరిగి సాయంత్రం కూడా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. అయితే దానిని నెయ్యితో వెలిగించాల్సి ఉంటుంది. అనంతరం శ్రీ మహా విష్ణువు మంత్రాలను జపిస్తూ.. తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయట. అలాగే తులసిని పూజించే సమయంలో తులసి మంత్రాలు, తులసి చాలీసా పఠించాలి. అనంతరం హారతినిస్తే పూజ పూర్తవుతుంది. తద్వారా వివిధ రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను చేర్చడం మాత్రం మరువవద్దు. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లబిస్తుంది.
