స్కంద షష్టి రోజున పూజ ఎలా చేయాలి?

సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడో తెలుసుకున్నాం కదా. సాధారణంగా కార్తీక మాసంలోని శుక్ల పక్షం షష్టి తిథి రోజున సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకుంటారు. ఈ మాసంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే మన కష్టాలన్నీ పోయి జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఈ క్రమంలోనే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందట. సుబ్రహ్మణ్య షష్టి నాడు కార్తికేయుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఇవాళ తెల్లవారుజామున నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి దేవుడి గుడిలో లేదంటే మరే ఇతర స్థలాన్ని అయినా శుభ్రం చేసి కార్తికేయ విగ్రహాన్ని లేదంటే చిత్ర పటాన్ని ప్రతిష్టించాలి.

అనంతరం పూజకు అవసరమైన నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చందనం, అక్షతం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి. కార్తికేయ స్వామి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం పంచామృతంతో కార్తికేయుడిని అభిషేకించి దేవుడికి చందనం, అక్షితలు సమర్పించాలి. పూలు.. ముఖ్యంగా వాటిలో వీలైనంత వరకూ తామరపువ్వులను ఉండేలా చూసుకుని స్వామివారికి సమర్పించాలి. పండ్లు, స్వీట్లతో పాటు ఆహార పదార్దాలను నైవేద్యంగా సమర్పించి కార్తికేయుడికి పూజ నిర్వహించి హారతి ఇవ్వాలి. అనంతరం స్కంద షష్ఠి శీఘ్ర కథను పఠిస్తే పూజ పూర్తైనట్టే. పూజ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి.

Share this post with your friends