పూజ… జపం… ధ్యానం అంటే ఏమిటంటే..

పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జపః కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయః అంటే… కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం. కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం. లయమంటే ఏ విధమైన ఆలోచనలూ లేని స్థితి. దీనినే కొంచెం వివ రంగా చెప్పుకుందాం… అర్చన చెయ్యాలంటే, పూజామందిరాన్ని శుభ్రం చేయడం, షోడశోప చార అర్చన… వీటన్నింటికీ సుమారు ఒక గంట పడుతుంది.

పూజ... జపం... ధ్యానం అంటే ఏమిటంటే..
పూజ… జపం… ధ్యానం అంటే ఏమిటంటే..

ఈ గంట వ్యవధిలో అష్టోత్తర శత నామం చేస్తాం. ఈ అష్టోత్తర శతనామం సుమారు ఇరవై నిమిషాలు పట్టచ్చు. అంటే ఒక గంటలో మూడుసార్లు స్తోత్రం చేస్తాం. ఒక అష్టోత్తర శత నామంలో ఒక నామం ఒకసారే వస్తుంది. అంటే ఒక గంటలో ఒక నామాన్ని 3,000 సార్లు జపం చేస్తాం. ఇలా నామ జపం చేస్తూ ఉంటే.. ఒక్కో సారి మనల్ని మనమే మర్చిపోతాం. ఇది ధ్యానం. ఇలాగే ధ్యానం చెయ్యగా చెయ్యగా మనస్సు నిశ్చలం అవుతుంది. ఇదే లయం…

Share this post with your friends