ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మనిషి జీవితాన్ని ఎంత నరకప్రాయం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది ఎంతో శ్రమించి పని చేస్తుంటారు. కానీ అది నిలవదు. అలాగని వారేమీ దుబారా ఖర్చులు చేయరు. లక్ష్మీదేవిని ఇంట నిలుపుకోవడం ఎలాగో చూద్దాం. సానుకూల పవనాలు ఉన్న ఇల్లు నిజంగా స్వర్గమే. ఇంట్లో ఎలాంటి మంచి జరగాలన్నా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అలా ఉన్న ఏ ఇల్లైనా లక్ష్మీ నిలయమే. ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలతో నిండి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ నిలవదు. నిత్యం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట గొడవలు లేకుండా చూసుకోవాలి.
అలాగే సూర్యోదయానికి ముందే ఇంటి ముంగిట ముగ్గు పెట్టుకోవాలి. ఇంట్లో నిత్యం సాంబ్రాణి ధూపం వేయాలి. ప్రతి శుక్రవారం లక్ష్మిదేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. పూజలో తామర పూలు, పారిజాతాలు, నీలం, తెలుపు రంగు శంఖు పూలు వినియోగిస్తే మంచిది. లక్ష్మీదేవికి నిత్యం తేనె కలిపిన పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి శుక్రవారం నిమ్మకాయ పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఒక శంఖాన్ని తీసుకొచ్చి పూజా మందిరంలో ప్రతిష్టించాలి. ఇంట్లోని ఉత్తర దిశలో వెండి ఏనుగులను ఉంచితే ధన ప్రవాహం ఇంటనే ఉంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని బిల్వపత్రాలతో పూజించాలి. అలాగే గోమాతను శుక్రవారం తోకభాగం వైపు పసుపు, కుంకుమలతో పూజించినా.. గోమాతకు పచ్చగడ్డి తినిపించాలి.