హనుమంతుడికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఎలా అయ్యిందంటే..

హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని భక్తితో పూజిస్తే కష్టాలు తొలగి మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. ఈ పూజలో ప్రత్యేకంగా తమలపాకుల మాలను సమర్పించడం ఆనవాయితీ. ఎందుకంటే హనుమంతుడికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైనది.

హనుమంతుడికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఎలా అయ్యిందంటే..
హనుమంతుడికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఎలా అయ్యిందంటే..

తమలపాకు ప్రాధాన్యం కథ:

సీతాన్వేషణలో ఆంజనేయుడు అశోకవనంలోకి చేరాడు. అక్కడ సీతమ్మవారు ఉన్నారని తెలుసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వెళ్లే ముందు ఆమె ఆశీర్వాదం కోరాడు. ఆ సమయంలో వనంలోని పుష్పాలు ఆమెకు అందుబాటులో లేకపోవడంతో, ఆమె తమలపాకులను కోసి ఆంజనేయుడి తలపై ఉంచి దీవించారు. అప్పటి నుండి హనుమంతుడికి తమలపాకు ప్రత్యేకమైనదిగా మారింది. అంతేకాదు, సీతమ్మవారి దగ్గర నుంచి బయలుదేరిన ఆంజనేయుడు ఆకాశంలో గట్టిగా హుంకరించాడు. ఆ శబ్దం విని వానరులు సీతమ్మ జాడ దొరికిందని ఆనందంతో ఎదురుచూశారు. ఆంజనేయుడు చేరుకున్నప్పుడు వారు తమలపాకుల మాలతో ఆయనను సన్మానించారు. ఆ క్షణంలో హనుమంతుడు పరమానందంతో ఉప్పొంగి దీవెనలిచ్చాడు. అందుకే ఇవాళ కూడా ఆయనకు తమలపాకుల మాలను సమర్పిస్తే భక్తులకు కృప ప్రసాదిస్తారని నమ్మకం.

Share this post with your friends