ఇంట్లో దేవతల విగ్రహాలు ఎంత ఎత్తుండాలి? ఏ దిశలో పెట్టాలి?

దేవాలయాల్లో విగ్రహాలు ప్రతిష్టించాలంటే చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున పండుగ నిర్వహించి మరీ ప్రతిష్టారు. మరి ఇంట్లో అయితే.. అంత పెద్ద పండుగలా అయితే చేయము కానీ కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి. ఇంట్లో మనం దేవుడి గదిలో పెట్టే విగ్రహాల సైజు చిన్నగానే ఉండాలని పండితులు చెబుతారు. అసలు మనం ఇంట్లో దేవుని గదిలో ప్రతిష్టించే దేవుని విగ్రహ పరిమాణం ఎంత ఉండాలి? పూజ గదిలో దేవుని విగ్రహం 1 అంగుళం నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది. అయితే కొందరు ఇళ్లలోని పూజ గదిలో ఇంతకంటే పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో తప్పక కొన్ని నియమాలు కూడా పాటించాలట.

దేవుని గది ఎప్పుడూ ఈశాన్య దిక్కులోనే నిర్మించుకోవాలి. ఇక విగ్రహాలను దేవుని గదిలో తూర్పు దిక్కున ప్రతిష్టించాలట. ఈ దిశలో విగ్రహాలను ప్రతిష్టిస్తే.. విగ్రహం ముఖం మాత్రం పడమర వైపు తిప్పి పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. ఇక ఇంట్లో దేవుని గదిలో శివలింగాన్ని ప్రతిష్టించాలనుకునే వారు పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. అలాగే శివలింగాన్ని ఉత్తర భాగంలో ప్రతిష్టించాలి. శివలింగం కాకుండా ఇతర దేవతా విగ్రహాలను ఇంట్లో పెడితే ఆయా దేవతల ముఖం దక్షిణ దిశలో ఉండేలా ఉత్తర దిశలో విగ్రహాలను పెట్టాలి. హనుమంతుడి విగ్రహాన్ని ఈశాన్య దిశలో పెట్టాలి.

Share this post with your friends