కాత్యాయని వ్రతం ముగిశాక ఉద్యాపన ఎలా చెప్పాలి?

కాత్యాయని వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకున్నాం కదా. నిష్టగా ఈ వ్రతం ఆచరిస్తే వివాహంలో ఎలాంటి ఆటంకాలున్నా, జాతక దోషమున్నా, రాహు కేతు దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్మకం. అయితే ఏడు వారాల పాటు ఈ పూజను నిష్టగా నిర్వహించుకున్న మీదట 8వ వారం ఉద్యాపన చెప్పాలని తెలుసుకున్నాం కదా. అసలు ఆ ఉద్యాపన ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించాలి. ఒకవేళ అలా స్నానం చేయించడం వీలు పడని వారు ఉదయం ముత్తైదువుల ఇంటికి వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తల స్నానమునకు ఇచ్చి రావాల్సి ఉంటుంది.

ఇక ముత్తైదువులకు పెట్టేందుకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవేంటంటే.. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, చీర, 7 రవికలను వాయనమివ్వాలి. అక్షతలు వేయించుకొని ఆశీస్సులు పొందితే ముత్తైదువులకు దక్షిణ తాంబూలాదులతో కాత్యాయన వ్రత పుస్తకములను సమర్పించాలి. దీంతో కాత్యాయని వ్రతం పూర్తవుతుంది. కాత్యాయని వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే.. “ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గిః ప్రచోదయాత్” అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. నిష్టగా పూజ నిర్వహిస్తే ఫలితం చాలా బాగుంటుందట.

Share this post with your friends