
మూఢం అనేది రెండు రకాలు. ఈ మూఢ సమయంలో ఏం పని తలపెట్టినా కూడా కలిసి రాదు. మూఢ సమయంలో శుభ కార్యాలను నిర్వహించకూడదు. ఇలా చేస్తే మంచి జరుగకపోగా.. చెడు జరుగుతుందని చెబుతారు. కాబట్టి మూఢ సమయంలో పొరపాటున కూడా ఏ పనీ చేపట్టారు. మూఢం అనేది రెండు రకాలు. ఒకటి గురు మూఢం కాగా.. రెండవది శుక్ర మూఢం. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కూడా కలిసి రాదట. అందుకే దీనిని మూఢం అంటారు. ఈ నెలలో మూఢం ప్రారంభమవుతుంది.
ఇప్పుడు వచ్చేది గురుమూఢం. ఇది జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు.
