ప్రదక్షిణలు ఎన్ని రకాలు? వాటి గురించి పూర్తి వివరాలు..

ఆలయానికి వెళ్లినప్పుడు మనం ప్రదక్షిణ చేస్తూనే ఉంటాం. కానీ ప్రదక్షిణలో ఎన్ని రకాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. ప్రదక్షిణలో ఏకంగా ఐదు రకాలున్నాయి. అవేంటంటే.. ఆత్మ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ, దండ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ, మిశ్రమ ప్రదక్షిణ. వీటిలో మనకు ఒకటో రెండో ప్రదక్షిణలు తెలుసు. మిగిలిన వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఐదు రకాల ప్రదక్షిణల గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం.

1. ఆత్మప్రదక్షిణ: సాదారణంగా ఇంట్లో ఏదైన వ్రతం లేక పూజ చేసిన తరువాత: మన చుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణాపథం లేనప్పుడు ఒకేచోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది.
2. పాదప్రదక్షిణ: సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాపథంలో గానీ, ఆలయం చుట్టుగాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది.
3. దండ ప్రదక్షిణ: ప్రదక్షిణాపథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి, అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగనమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయడాన్ని దండప్రదక్షిణ అనంటారు. ఈ పద్ధతిలో నాలుగుదిక్కులలోగానీ, లేక నాలుగుదిక్కులు, నాలుగుమూలలు కలిపి ఎనిమిదిచోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు.
4. అంగప్రదక్షిణ: మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకుని, ఆలయం చుట్టూ దొర్లుతూచేసే ప్రదక్షిణకు అంగప్రదక్షిణ అని పేరు.
5. మిశ్రమ ప్రదక్షిణ: పైన పేర్కొన్న ప్రదక్షిణా పద్దతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణే మిశ్రమ ప్రదక్షిణ.

Share this post with your friends