నల్లమల అడవుల్లో ఎన్ని సందర్శనీయ ప్రదేశాలున్నాయంటే..

తూర్పు కనుమల్లోని నల్లమల అడవులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు ఎక్కువగా ఉండటంతో దీనిని టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ అడవులు ప్రకృతి అందాలకే కాకుండా ఆధ్మాత్మికతకు కూడా నెలవుగా పేర్కొంటారు. నల్లమల అడవుల్లోని ఆధ్యాత్మిక కేంద్రాల గురించి తెలుసుకుందాం. నల్లమల అడవుల్లోని సలేశ్వరంలో శివుడు కొలువై ఉంటాడు. ఇక్కడి ప్రకృతి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక గొప్ప జలపాత ఉంది. ఇది ఆకాశగంగను తలపిస్తూ వేసవిలో సైతం చల్లగా ఉంటుంది.

అలాగే అహోబిలం దగ్గర ఉన్న ఉల్లెడ క్షేత్రం ఉంటుంది. దీనిలో ఉమామహేశ్వరుడు లింగమయ్య రూపంలో కొలువై ఉన్నాడు. దీన్ని చూసేందుకు వెళ్లాలంటే అడవుల్లో కాలి నడకన సెలయేళ్ళు దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నల్లమల కొండల్లోని బ్రహ్మంగారి మఠానికి కొంచెం దూరం వెళఇతే 100 వరకూ గుహలు కనిపిస్తాయి. ఈ గుహల్లో శివుడు గవి మల్లేశ్వరునిగా దర్శమనమిస్తాడు. నల్లమల అడవుల్లో ఉన్న మరో ఆలయం రంగనాథ స్వామి ఆలయం. ఇది కేవలం శనివారం మాత్రమే ఉదయం తెరచి సాయంత్రం 6 అయితే మూసివేస్తారు. ఇక్కడి గుండ్లకమ్మ నదిపై ఉండే జలపాలం స్పెషల్ అట్రాక్షన్. నల్లమల అడవుల్లో మరో క్షేత్రం కొలనుభారతిలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది. ఇక నల్లమల అడవుల్లో సందర్శనీ ప్రదేశాల్లో నెమలిగుండం ఒకటి. నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య నెమలిగుండంలోకి జలపాతం జాలువారుతూ ఉంటుంది. దీన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు.

Share this post with your friends