ఇంటిపై చెట్టు నీడ లేదంటే ఆలయం నీడ పడితే ఏం జరుగుతుందనేది తెలుసుకున్నాం. మన ప్రమేయం లేకుండా జరిగే దోషాలను వేదా దోషాలని పిలుస్తారు. ఆలయ నీడ, చెట్టు నీడే కాదు.. ఇంకా చాలా రకాల వేదా దోషాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
భవన ఛాయా వేదా దోషం: మీ ఇంటి పక్కన ఉన్న ఇల్లు మీ ఇంటి కంటే ఎత్తులో ఉంటే దాని నీడ మీ ఇంటిపై పడుతుంది. అది చాలా పెద్ద దోషమని దీనిని భవన ఛాయా వేదా దోషం అని పిలుస్తారు.దీని కారణంగా సక్సెస్ తొందరగా రాదట.
ద్వారవేదాదోషం: ఒక మెయిన్ ఎంట్రన్స్‌కు గాలి, వెలుతురు ప్రసరించకుండా ఏదైనా అడ్డుగా ఉంటే దానిని ద్వారవేదాదోషం పిలుస్తారని తెలిపారు. ఆ ఇంటికి అదృష్టం అనేది ఉండదట.
అంధక వేదా దోషం: ఇంటి సింహ ద్వారానికి రెండు వైపులా కిటికీలు తప్పనిసరిగా ఉండాలట. ఇలా కాకుండా ఒకవైపే కిటికీ ఉంటే అంధక వేదాదోషం ఏర్పడుతుందని తద్వారా ఇంటి యజమానికి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట.
వాస్తు వేదా దోషం: ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా వాచ్‌మెన్ రూమ్, స్టోర్ రూమ్ ఉంటే వాస్తు వేదాదోషం ఏర్పడుతుందట. ఆ ఇంట్లో ఆస్తులు ఎక్కువ కాలం ఉండవట. త్వరలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట.
కూపవేదాదోషం: అండర్ గ్రైండ్ డ్రైనేజ్ సిస్టమ్, నీటి సంపు, బోర్ వంటివి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే దానిని కూపవేదాదోషంగా పిలుస్తారట. ఇలాంటి దోషం ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు తప్పవట.
స్వర వేదాదోషం: మీ ఇంటి తలుపు తెరిచే, మూసే సమయంలో శబ్ధం ఎక్కువగా రావడాన్ని స్వర వేదాదోషంగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంటి యజమాని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారట.
ఇలాంటి వాస్తు దోషాలన్నీ మీ ఇంట ఉంటే మాత్రం ఇంటిపై ఆంజనేయుడి బొమ్మ ఉన్న కాషాయ రంగు జెండాను ఏర్పాటు చేసుకుంటే చెడు ప్రభావం కాస్త తగ్గుతుందట.