మారేడు చెట్టులో ఎన్ని రకాల ఔషధ గుణాలున్నాయంటే..

మారేడు చెట్టుకు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మారేడు చెట్టులో దాగి ఉన్న శాస్త్రీయ కోణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మారేడు చెట్టు మూలాన్ని గంధం, పుష్పాలతో పూజిస్తే ఆ ఇంట్లో నివసించేవారు సుఖసంతోషాలతో ఉండటమే కాకుండా శివలోక అర్హతను సైతం పొందుతారు. మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే శరీరం విడిచిపెట్టాక శివైక్యం చెందుతారట. మారేడు చెట్టు దగ్గర 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దీపం వెలిగిస్తే తత్వజ్ఞానంతో పాటు మహేశ్వరునిలో ఐక్యమవుతారని చెబుతారు.

మారేడు చెట్టు శాస్త్రీయపరంగానూ గొప్పదే. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతారు. మారేడు దళాలు సుగంధ భరితంగానూ.. దాని చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. ఈ చెట్టు ఉన్న చోట కాలుష్యమనేది దరి చేరదని చెబుతారు. మారేడు చెట్టు ఆకులు మాత్రమే కాదు.. దాని పండు, చెట్టు బెరడులో కూడా అనేక రకాల రోగాలను నివారించే మూలికలు ఉంటాయట. వీటన్నింటినీ ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. మారేడు చెట్టు కారణంగా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. దీనిని హిందువులంతా భక్తితో పూజించుకుంటారు.

Share this post with your friends