హంపి, కుమావున్, గోవాలో హోలీ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారంటే..

దేశమంతా హోలీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలోని విజయనగరం జిల్లాలో ఉన్న హంపిలో పెద్ద ఎత్తున హోలీ ఉత్సవాలు నిర్వహిస్తారు. హంపి దేశ వ్యాప్తంగా హోలీ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. హోలీ నాడు ఇక్కడ జానపద పాటలు పాడుతూ.. నృత్యం చేస్తారు. ఆట, పాటలు పూర్తైన అనంతరం ప్రజలు తుంగభద్ర నదిలో స్నానం చేస్తారు.

ఉత్తరాఖండ్‌లోని కుమావున్‌ హోలీ ఉత్సవాలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ హోలీ వేడుకలను మూడు రకాలుగా జరుపుకుంటారు. ఆ మూడు రకాలేంటంటే.. కూర్చునే హోలీ, నిలబడి ఉండే హోలీ, మహిళల హోలీ. ఇక్కడ హోలీ వేడుకల్లో రంగులు మాత్రమే కాదు సంగీతం, వినోదం, ఆధ్యాత్మికతను కలిగి ఉంటాయి

ఇక గోవాలో హోలీ సందర్భంగా షిగ్మోత్సవ్ జరుగుతుంది. ఈ ఉత్సవ్‌ను హిందువుల పౌరాణిక అంశాలకు అనుసంధానం చేస్తూ హోలీని జరుపుకుంటారు. 14 రోజుల పాటు కొనసాగే ఈ షిగ్మోత్సవ్ ఉత్సవ్‌లో భాగంగా సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ జానపద నృత్యాలు నిర్వహిస్తారు. నగరం అంతటా టేబుల్స్ ఏర్పాటు చేసి దేవాలయాల్లో పూజలు జరుపుతారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు గోవాలో హోలీ వేడుకలను చూడటానికి వస్తారు.

దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన పూజరి, ఈవోపై వరుస ఫిర్యాదులు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన అర్చకుడు ఆలయాన్ని వదిలి ఎమ్మెల్యే వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇక భక్తుల కానుకలు, తప్పుడు బిల్లులు, భూముల అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ఆలయ ఈవోపై అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Share this post with your friends