అమ్మవారు భక్తులతో ఎలా మాట్లాడుతుందంటే..

మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని పృథ్వీపూర్ తహసీల్ ప్రాంతంలోని గ్రామ పంచాయితీ మడియాలోని అచ్రు మాత దేవాలయంలో ఉన్న అమ్మవారు భక్తులతో మాట్లాడుతుందని తెలుసుకున్నాం. మరి ఈ ఆలయంలో అమ్మవారు ఎలా మాట్లాడుతుందంటారా? అచ్రు మాత ఆలయంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచే అమ్మవారు భక్తులతో మాట్లాడుతుందట. అనంతరం చెరువు నుంచే భక్తుల కోరికలు తీరుస్తుందట. అంతేకాదు.. ఆ కోరిక నెరవేరుతుందో లేదో కూడా అమ్మవారు చెబుతుందట.

ఈ ఆలయంలోని అమ్మవారు తన భక్తులతో మాట్లాడటానికి ముందు అమ్మవారు భక్తులకు ప్రసాదం ఇస్తుందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతారు. అమ్మవారు భక్తులకు నిమ్మ, ద్రాక్ష, పూలు, జిలేబి, పెరుగు, చిరోంజి మొదలైన వాటిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తుందని భక్తులు చెబుతున్నారు. ఇక చెరువులోని నీరు ఎప్పటికీ ఎండిపోదట. ముఖ్యంగా వేసవి కాలం వస్తే బుందేల్‌ఖండ్ మొత్తం నీటి సమస్య వస్తుందట. అయితే ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయంలో ఉన్న చెరువు మాత్రం ఎప్పుడూ నీటితో కళకళలాడుతూనే ఉంటుందట.

Share this post with your friends