సూర్యుని ఏడు కిరణాలను ఎలా అభివర్ణిస్తారంటే..

సూర్యుని ఏడు కిరణాలు – సప్త జ్ఞాన భూమికలుగా పేర్కొంటారు. జ్ఞానంలో ఏడు స్థితులు ఉంటాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటారు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శుభేచ్ఛ → బ్రహ్మజ్ఞానం కావాలనే ఆరాటం, శాశ్వత దుఃఖరాహిత్యం కావాలనే కోరిక.

విచారణ → జ్ఞానం పొందే మార్గాలపై మీమాంస (ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగతీ).

తనుమానసం → సాధనలో నిరంతరంగా మునిగిపోవడం.

సత్త్వాపత్తి → రజస, తమస లేని శుద్ధ సాత్త్విక స్థితి; యోగి అవతారం.

అసంసక్తి → శరీరం–సంసారం తాత్కాలికమని గ్రహించి, దివ్యదృష్టి మేల్కొలిపే స్థితి.

పదార్థభావని → వస్తువుల అంతరార్థాన్ని ప్రత్యక్షంగా అనుభవించే స్థితి; సవికల్ప సమాధి.

తురీయం → జాగ్రత్త–స్వప్న–సుషుప్తి దాటిన స్థితి; నిర్వికల్ప సమాధి, బుద్ధత్వం.

తురీయ స్థితిలో సహస్రదళ కమలం వికసించి, యోగి సర్వలోకాలకు మార్గదర్శకుడవుతాడు. “ధ్యానం మనసుకు శాంతి, ఆత్మకు బలం, జీవితానికి వెలుగునిస్తుంది.”

Share this post with your friends