ఈ శివయ్యకు చీపురును సమర్పించే సంప్రదాయం ఎలా వచ్చిందంటే..

భక్తులు చీపురు సమర్పించే శివాలయం గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ ఆలయాన్ని పాతాళేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని మొరాదాబాద్‌లోని బహ్జోయికి చెందిన సదత్‌బరి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని ఎక్కువడా చర్మ వ్యాధుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు పాలతో చీపురును సమర్పిస్తూ ఉంటారు. మరి ఈ చీపురును సమర్పించే సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది. అనే విషయాలను తెలుసుకుందాం. పాతాలేశ్వర మహాదేవ శివాలయం 1902లో నిర్మించబడింది. ఇది నిర్మించడానికి ముందు జరిగిందే చీపురు కథ.

కొన్ని శతాబ్దాల క్రితం భిఖారి దాస్ అనే వ్యాపారవేత్త చర్మవ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉండేవాడట. ఎన్ని రకాల చికిత్సలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఆయన కోలుకున్నదే లేదు. ఒకసారి భిఖారి దాస్ ఎక్కడికో వెళ్తూ.. దారిలో దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఆశ్రమానికి నీళ్లు తాగడానికి వెళ్లాడు. అక్కడ ఒక చీపురుని తట్టుకోవడంతో ఆయన చర్మ వ్యాధి పూర్తిగా నయమైపోయిందట. వెంటనే ఆనందంతో బిఖారి దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న సాధువులకు డబ్బులను ఇవ్వడానికి ప్రయత్నించగా వారు నిరాకరించారు. ఆ డబ్బుతో గుడి కట్టించమని చెప్పగా వెంటనే శివాలయాన్ని నిర్మించాడు అప్పటి నుంచి ఇక్కడ చీపురును సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this post with your friends