లక్ష్మీదేవికి గుడ్లగూబ, విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం ఎలా అయ్యిందంటే..

నారదుడు గానబంధు వద్ద సంగీతం వెయ్యేళ్ల పాటు నేర్చుకున్నాడట. కఠోర దీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహ పాఠకులంతా పొగిడేస్తుంటే సంగీతంలో తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. నారదుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఆనందంతో గురువు ఉలూకపతి వద్దకు వెళ్లి గురు దక్షిణగా ఏం కావాలో కోరుకోమన్నాడు. దీనికి ఉలూకపతి ఈ ధరాతలం ఉన్నంత వరకూ సంగీత కళతో పాటు తాను కూడా గుర్తుండిపోయే వరాన్ని ప్రసాదించమని కోరాడు. అలా తన మనసులోని మాట బయట పెట్టాడు.

నారదుడు మాత్రం అది చాలా చిన్న కోరిక అని.. అది తను తీర్చాల్సిన అవసరం లేదని.. ఉలూకపతికి ఉన్న సంగీత పాండిత్యమే తీర్చుతుందని చెప్పాడు. భూమిపై సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి ఢోకా లేదని తెలిపాడు. తనకు సంగీత విద్యను నేర్చినందుకు ప్రతిగా తానే గురుదక్షిణ చెల్లిస్తానని చెప్పాడు. గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నానని నారదుడు వెల్లడించాడు. అలాగే ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరిస్తావని చెప్పాడు. నారదుడు ఇచ్చిన వరంతో ఉలూకపతి.. శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి వాహనంగా మారాడు.

Share this post with your friends