కైకేయికి మంథరతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలుసుకున్నాం. వారిద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది కూడా మనం తెలుసుకున్నాం. మంథర వరుసకు కైకేయికి సోదరి అవుతుంది. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. ఎలాంటి సమయంలోనూ కైక మాత్రం మంథరను వదల్లేదు. తన వెంటే ఉంచుకుంది. అయితే మంథర చాలా అందంగా ఉండేదని చెప్పుకున్నాం. మరి అంత అందంగా ఉండే మంథర అంద వికారంగా ఎలా మారిందో తెలుసుకుందాం. మంథర చాలా తెలివైన, అందమైన యువరాణి.
అలాంటి మంథరకు చిన్నతనంలోనే అనారోగ్యం సోకింది. దీంతో ఆమె దాహం తట్టుకోలేకపోయింది. ఒకరోజు మంథర దాహం తట్టుకోలేక మంథర ఒక ద్రవాన్ని తాగేసిందట. ఆ ద్రవ ప్రభావంతో మంథర శరీరంలోని భాగాలన్నీ పని చేయడం మానేశాయట. ఆమెకు ఆమె తండ్రి ఎందరో వైద్యులను పిలిపించి రకరకాల చికిత్సలు చేయించారట. ఆ తరువాత మంథర శరీరంలో వ్యాధి అయితే నయమైంది కానీ ఆమె వెన్నెముక మాత్రం శాశ్వతంగా వంకరగా మారిపోయింది. ఆ కారణంగా ఆమె వంగిపోయి అంద వికారంగా తయారైంది. ఈ కారణంతోనే మంథర వివాహం చేసుకోకుండా ఉండిపోయింది.