ప్రయాగ్‌రాజ్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

ప్రయాగ్‌రాజ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పురాణకాలంలో ప్రజాపతి బ్రహ్మ ప్రయాగ్‌రాజ్‌లో అనేక యాగాలు చేశాడట. కాబట్టి ఆ పేరు మీదుగానే ఈ ప్రయాగ అని పేరు వచ్చిందని తెలుస్తోంది. ప్రయాగరాజ్ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పేర్కొంటారు. ప్రయాగ‌్‌రాజ్ అని పేరును పలికినంత మాత్రాన్నే సకల పాపాలు పటాపంచలవుతాయట. ఇక ప్రయాగ్‌రాజ్‌లోని గంగ యమునా సరస్వతి నదుల సంగమస్థానం కూడా కావడం విశేషం. పవిత్ర త్రివేణి సంగంలో స్నానం మోక్షదాయకని అంటారు. ఇక్కడ పితృదేవతలకు కార్యాలు నిర్వహస్తే వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ దానధర్మాలు చేసినా కూడా కోటి రెట్ల పుణ్యం లభిస్తుందట.

ఎందరో చక్రవర్తులు ప్రయాగ్‌రాజ్‌లోనే రాజ్యం, సంపదలను దానం చేసి మోక్షం పొందారట. మహాకుంభమేళాకు కోట్ల మంది భక్తులు స్నానమాచరించేందుకు వెళుతున్నారు. ఇక్కడ తప్పక సందర్శించుకోవాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది అక్షయ వట వృక్షం. ఇది ఎప్పటికీ నాశనం కాదట. కల్పాంతం వరకూ నిలిచి ఉంటుందట. అలాగే శంఖమాధవ, గదామాధవ, చక్రమాధవ అనే 14 మంది మాధవులు ఇక్కడ విరాజిల్లుతున్నారట. అలాగే ఆది శంకర మండపం.. దీనిని తప్పక దర్శించుకుంటే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు. శక్తి పీఠాల్లోనూ ఇదొకటి. సతీదేవి వేలు ఇక్కడ పడిపోయిందని నమ్మకం. ఈ శక్తి పీఠంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. కేవలం పేరు పలికితే చాలు.. సకల పాపాలు నాశనమవుతాయట.

Share this post with your friends