హనుమ రామదూత ఎలా అయ్యాడు?

రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మకు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే. అగ్ని ముఖావై దేవాః. దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి, హనుమకి ఏమిటి సంబంధం అంటే.. సృష్టి క్రమంలో ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. వాయువు నుంచి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా.. కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్నితో పోల్చారు.

హనుమ రామదూత ఎలా అయ్యాడు?
హనుమ రామదూత ఎలా అయ్యాడు?

అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు. కనుక దూత అంటే కేవలం దూత అని మాత్రమే కాదు.

నుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?
కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సును ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ పుత్రుడే.

ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి?
నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.

వీరలో ఎన్ని రకాలు అవి ఏవి?
దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.

Share this post with your friends