ఆహారం దొరక్క బోయ బక్కచిక్కి పోయాడు. కానీ అతని ముఖంలో ఏదో తెలియని దివ్య వర్చస్సు. అది గమనించిన దుర్వాస మహర్షి బోయను పరీక్షించదలిచాడు. దుర్వాసుడు తనకు మృష్టాన్న భోజనం కావాలని కోరాడు. పక్క గ్రామానికి వెళ్లి బోయ ఆహారాన్ని సేకరించి తీసుకొచ్చాడు. తను స్నానమాచరించనిదే భోజనం చేయనని దుర్వాసుడు చెప్పాడు. అలాగే తను నది వరకూ వెళ్లలేనని.. కాబట్టి బోయే తనతో స్నానం చేయించాలని కోరాడు. బోయ వెళ్లి నదికి భక్తితో నమస్కరించి విషయాన్ని చెప్పాడు. బోయ వెంట నది వెళ్లింది. అప్పుడు దుర్వాసుడు నదిలో స్నానమాచరించాడు.
బోయ సత్యవ్రతాన్ని చూసి దుర్వాసుడు ఎంతో సంతోషించాడు. బోయను అనుగ్రహించతలచి ‘‘నీ సత్యనిష్ఠకు, భక్తిశ్రద్ధశ్రద్ధలకు సంతోషించాను. ఇక నుంచి నీవు సత్యవ్రతుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. అంతేకాకుండా సకల శాస్త్రాలలోనూ పాండిత్యాన్ని పొందుతావు” అని ఆశీర్వదించాడు. ఈ సత్యవ్రతుడే తర్వాతి కాలంలో రాజయ్యాడని చెబుతారు. మహాత్ములు చెప్పిన దానిని శ్రద్ధగా విని, దానిని నిష్ఠతో పాటించడం వల్లనే సత్యవ్రతుడికి అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అందుకే సత్యవ్రతాన్ని మించిన వ్రతం కానీ.. అహింసకు మించిన ధర్మం లేదని చెబుతారు.