వినాయకుడి వాహనంగా ఎలుక ఎలా మారిందంటే..

మొత్తానికి వినాయకుడిని ఎలుక రూపంలో ఉన్న క్రౌంచుడిని హెచ్చరించడంతో మరలా పొరపాటు చేయబోనని.. దయార్ద్ర హృదయంతో తనను క్షమించమని వేడుకున్నాడు. ఆపై తనకు శాపవిమోచనం కలిగించాలని క్రౌంచుడు వేడుకున్నాడు. తన గంధర్వ రూపాన్ని తనకు ఇవ్వమని కోరాడు. క్రౌంచుడి శాపానికి కారణాన్ని గ్రహించిన వినాయకుడు.. ఇంద్రుని శాపం తొలగిపోయేది కాదని గ్రహించాడు. ఈ సమస్యకు పరిష్కారాన్ని సైతం ఆలోచించి ఉపాయాన్ని క్రౌంచుడికి చెబుతాడు. ఏ శుభకార్యమైనా, నోములైనా, వ్రతాలైనా ముందుగా మనం ఎలాంటి విఘ్నం కలిగించవద్దని కోరుతూ వినాయకుడిని పూజిస్తూ ఉంటాం.

ఇంద్రుడి శాపాన్ని తొలగించడం సాధ్యం కాదు కాబట్టి మధ్యేమార్గంగా మూషికం కూడా తనతో పాటు తొలి పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి వినాయకుడు ప్రసాదించాడు. అప్పటి నుంచి వినాయకుడికి ఎలుక వాహనంగా మారింది. అయితే తరువాత వినాయకుడికి మరో సమస్య ఎదురైంది. తనదేమో భారీ ఖాయం. ఆ బరువును మూషికం మోయలేదు. కాబట్టి క్రౌంచుడు తన బరువును మోయగలిగేలా సైతం వరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా గణపతి వాహనంగా మారిన ఎలుక ఆయనతో పాటు తొలి పూజను అందుకుంటున్నాడు. అలా చిట్టెలుక వినాయకుడికి వాహనంగా మారి ఆయనతో పాటు తొలి పూజను అందుకుంటోంది.

Share this post with your friends