నాగసాధువులు గడ్డకట్టే చలిలోనూ దుస్తులు లేకుండా ఎలా ఉండగలుగుతారు?

నేడు ప్రపంచమంతా ప్రయాగ్‌రాజ్ వైపే చూస్తోంది. పెద్ద ఎత్తున ప్రజానీకం మహాకుంభమేళాకు వెళ్లి స్నానమాచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13వ తేదీ, పుష్యపౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమైంది. నాటి నుంచి కోట్ల మంది ప్రజలు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ముఖ్యంగా నాగ సాధువులు హైలైట్ అవుతున్నారు. రోజుకో సాధువు హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అసలు నాగసాధువులు గడ్డకట్టే చలిలోనూ వస్త్రాలు కూడా ధరించరు. అసలు వారు అలా ఎలా ఉండగలుగుతున్నారు.

144 ఏళ్లకు ఓ సారి మాత్రమే జరిగే మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. దుస్తులు వేసుకుని ఇంట్లో ఉంటేనే చలిని తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది ఓపెన్ ప్లేస్‌లో వారంతా ఎలా ఉండగలుగుతున్నారు? కొందరు నాగ సాధువులు హిమాలయాల్లోనూ తపస్సు ఆచరిస్తూ ఉంటారు. అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం వారు చేసే కఠోరమైన సాధనే. అగ్ని సాధన, నాడి శోధన, మంత్ర పఠనంతో తమ శక్తిని పెంపొందించుకుంటారు. తద్వారా తమ శరీరంలో అంతర్గత వేడిని పెంపొందించుకుంటారు. ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.

Share this post with your friends