శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు జన్మించిన మధురతో పాటు.. ఆయన ఎక్కువ కాలం నివాసమున్న ద్వారకలో మరింత శోభాయమానంగా ఈ వేడుకలు జరగనున్నాయి. మధురలోని ప్రతి అణువులోనూ శ్రీకృష్ణుడు ఉన్నాడని అక్కడి వారు నమ్ముతారు. ఇక్కడ ఝులన్, ఘాట్ పేరిట ఉత్సవాలు జరుగుతాయి. మొదట ఝులన్ ఉత్సవం సందర్భంగా మధురలోని ప్రతి ఇంటిలోనూ ఊయలలను ఏర్పాటు చేసి బాల కృష్ణుడి విగ్రహాలను వాటిలో ఉంచుతారు. స్వామివారు ఊయలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు.
రెండవ భాగమైన ఘాట్‌లో బాగంగా ప్రతి ఆలయంలోనూ కృష్ణుడు జన్మించిన సమయంలో పూజలు జరుగుతాయి. అన్ని ఆలయాల్లోని గంటలన్నీ ఏకకాలంలో మోగుతాయి. భక్తులంతా శ్రీకృష్ణుడి భక్తిభావంతో ఉర్రూతలూగుతుంటారు. ఏకకాలంలో భక్తులు రాధా కృష్ణ నామాలను జపిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటారు. ధుర తర్వాత శ్రీకృష్ణుడు స్థిరపడ్డాడని చెబుతున్న ద్వారకలో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. ఇక్కడి ఆలయాల్లో భజన, కీర్తన, మంగళ హారతి వంటి కార్యక్రమాలతో పాటు ప్రజలు గర్భా నృత్యం చేస్తారు.