పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఏం జరుగుతుందంటే..

రామ, రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసురుడి సోదరుడైన మహిరావణుడు.. రామ, లక్ష్మణులను మాయోపాయంతో అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళతాడు. అక్కడ వారిని బలి ఇవ్వడానికి ఐదు దిక్కులలో ఐదు దీపాలను వెలిగించగా.. వాటిని ఒకేసారి ఆర్పేస్తేనే మహిరావణుడి మరణం సాధ్యమవుతుంది. దీనికోసం హనుమంతుడు ఐదు ముఖాల (పంచముఖి) రూపాన్ని దాల్చాడు. మరి ఆంజనేయస్వామి పంచముఖ రూపం మహిమ ఏంటి? అనేది తెలుసుకుందాం.

పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఏం జరుగుతుందంటే..
పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఏం జరుగుతుందంటే..

పంచముఖ ఆంజనేయుని ఐదు ముఖాలు కలిపి శక్తి, జ్ఞానం, రక్షణ, భక్తి, విజయం అన్నింటినీ ప్రసాదిస్తాయి. ప్రత్యేకంగా దుష్ట శక్తుల నుండి రక్షణ శని దోష నివారణ అఘోర, తాంత్రిక ప్రభావాల నివారణగా చెబుతారు. పంచముఖం అంటే కేవలం ఐదు ముఖాలు కాదు.. ఇది మనలోని ఐదు శక్తుల ప్రతీక.

1. మనసు
2. బుద్ధి
3. చిత్తం
4. అహంకారం
5. ఆత్మశక్తి

ఈ ఐదింటిని నియంత్రించే శక్తే ఆంజనేయుడని చెబుతారు.

ఈ పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే ఏం జరుగుతుందంటే..
పంచముఖ ఆంజనేయస్వామిని భక్తితో పూజిస్తే భయం తొలగుతుంది ధైర్యం పెరుగుతుంది. శత్రువులు దూరమవుతారు విద్యలో అభివృద్ధి, కుటుంబ రక్షణ. హనుమంతుడు కేవలం శక్తి కాదు.. “భక్తి + సేవ + వినయం”లకు పరమ రూపం. అలాంటి హనుమంతుడిని “శ్రీరామదూతం శరణం ప్రపద్యే” అని స్మరించినా అపారమైన శక్తి లభిస్తుంది.

Share this post with your friends