ఇక్కడ రాక్షసికి ఓ ఆలయం.. పెద్ద ఎత్తున దర్శించుకుంటున్న లవర్స్..

మన దేశంలో దేవతలతో పాటు చెట్లు, జంతువులను పూజించడం మనకు తెలిసిందే. అయితే రాక్షసులను సైతం పూజిస్తారని తెలుసా? కొన్ని ప్రాంతాల్లో రావణుడిని పూజిస్తే మరోచోట ఓ రాక్షసిని పూజిస్తారు. ఇక్కడి రాక్షసికి గుడి కూడా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే.. ఈ ఆలయానికి పెళ్లికి ఆటంకాలు ఎదుర్కొంటున్న ప్రేమికుల జంటలు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇంతకీ ఎవరా రాక్షసి? అసలు ఎక్కడుంది ఆ ఆలయం? ఎందుకు ఆమెను ప్రేమికుల జంటలు పూజిస్తాయి? వంటి విషయాలను తెలుసుకుందాం.

దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలీలో ఉంది ఆ దేవాలయం. ఈ ప్రాచీన దేవాలయంలో పూజలందుకునే దైవం పేరు హిడింబ దేవి. ఇక్కడి ఓ కారడవిలో కనీసం సూర్యకిరణాలు సైతం పడే అవకాశం లేని చోట ఈ ఆలయంలో హిడింబ దేవి వెలిసింది. ఆమెను అక్కడి వారంతా వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. భక్త జన సందోహంతో ప్రతి నిత్యం సందడిగా ఉండే ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే? వాస్తవానికి హిడింబ రాక్షసి అయినా కూడా ఎవ్వరికీ హాని తపెట్టలేదు. పైగా ధర్మం వైపు నిలబడింది. ఈ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వ్యక్తితో వివాహమవుతుందని నమ్మకం. దీంతో ప్రేమికుల జంటలు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.

Share this post with your friends