చాలా మంది జీవితంలో శని బాధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక కొన్ని రాశుల వారిని ఏలిన నాటి శని పట్టి పీడిస్తూ ఉంటుంది. అలాంటి శని దోషాలు పోవాలంటే కొన్ని పనులు మనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిప్పలాదుని చరిత్ర ఒక్కసారి చదివినా కూడా శని బాధలనేవే ఉండవని అంటారు. అసలు ఇంతకీ ఎవరా పిప్పలాదుడు? ఆయన చరిత్ర ఏమిటి? అంటే.. ఉపనిషత్తుని రచించిన వాడే పిప్పలాదుడు. అంతేకాకుండా తన తపస్సుతో మానవులకు జన్మించిన ఐదేళ్ల పాటు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి. ఆయన జన్మవృత్తాంతం ఏంటో ముందుగా తెలుసుకుందాం.
మహా దాన కర్ణుడిగా పేరొందిన గొప్ప మహర్షి దధీచి. ఇంద్రుని వజ్రాయుధానికి తన ఎముకలను ఇచ్చినవాడిగా ప్రఖ్యాతిగాంచాడు. మహర్షి మరణాననంతరం ఆయన మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అక్కడ ఆయన మృతదేహాన్ని దహనం చేస్తుండగా భర్త వినియోగాన్ని భరించలేని ఆయన భార్య తన మూడేళ్ల కుమారుడిని రావి చెట్టు తొర్రలో కూర్చోబెట్టి చితిలో దూకేసింది. రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడికి కాసేపటికి ఆకలి, దాహం వేశాయి. రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు, ఆకులు తింటూ పెరిగాడు. ఆ పిల్లవాడు మరెవరో కాదు.. పిప్పలాదుడు.