ప్రయాగ్‌రాజ్‌లోని హనుమంతుడి ఆలయం గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక్కడ ఆంజనేయుడు శయన రూపంలో ఉంటాడు. ఈ ఆలయం హనుమంతుడి పునర్జన్మతో సంబంధం కలిగిన ఆలయమని చెబుతారు. హనుమంతుడు రాక్షస వధ అనంతరం లంకను జయించిన తరువాత వృద్ధాప్యానికి చేరుకున్నాడట. అప్పుడు సీతమ్మ తల్లి హనుమంతుడు వెన్ను నిమిరి చిరంజీవ అని దీవించిందట. దీంతో ఆంజనేయుడు అమరత్వం పొందాడని చెబుతారు. హనుమంతుడికి సీతమ్మ వరం ఇచ్చిన ప్రదేశం ఇదేనని చెబుతారు.
ఆ తరువాత ఇక్కడ హనుమంతుడు శయన రూపంలో ఉండిపోయాడని అంటారు. విగ్రహాన్ని పరిశీలిస్తే జీవకళ ఉట్టిపడుతున్నట్టుగా ఉంటుంది. త్రివేణీ సంగమం గంగా తీరాన స్నానానికి ఎవరు వచ్చినా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తేనే గంగా నది పుణ్యస్నానం ఫలితం భక్తులకు దక్కుతుందని సీతాదేవి చెప్పిందని ప్రతీతి. అలాగే ఈ హనుమంతుడి ఆలయానికి వెళ్లిన వారు తప్పక సింధూరాన్ని సమర్పిస్తారు. ఇలా సింధూరం సమర్పించడం వలన హనుమంతుడు సంతోషించి తప్పక తన ఆశీస్సులు అందిస్తాడని నమ్మకం.