శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై లడ్డూ ప్రసాదానికి మునుపటి రుచి..!

తిరుమల తిరుపతి ఈవోగా జే.శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి ఒక్క విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఒకప్పుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూకి ప్రస్తుత లడ్డూకి చాలా తేడా ఉంది. కారణమేంటో తెలియదు కానీ రుచిలో మాత్రం మార్పొచ్చింది. ఇది నాటి లడ్డు రుచి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాటే. టీటీడీ ఈవోగా జే శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల ఆలయం లోపల.. వెలుపల అన్ని విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఆలయం లోపల వచ్చేసి దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రసాదం విషయంలోనూ దృష్టి సారించారు.

శ్రీవారి లడ్డూకు మునుపటి టేస్ట్ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల విధుల గురించి టీటీడీ ఈవో జె.శ్యామల రావు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. శుక్రవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఈవో, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి పోటు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా, బూందీ తయారీ, చక్కర కలపడం, జీడిపప్పును బూందీలో కలపడం, లడ్డును తయారుచేసి, లడ్డు కౌంటర్లోకి పంపడం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో పోటు శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends