శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 24న మొబైల్ ఫోన్లు.. వాచీల వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేయనున్నారు. జూన్ 24న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు, మొబైల్ ఫోన్లు 24 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం పంపిణీని కూడా ప్రారంభించారు. గతంలో ఈ కార్యక్రమం ఉండేది. అయితే ఇటీవలి కాలంలో అంతగా అన్నప్రసాద పంపిణీ జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ప్రతిరోజూ క్యూ లైన్లలో అన్నప్రసాదం పంపిణీని ప్రారంభించాలని టీటీడీ ఈవో శ్యామలరావు నిర్ణయించారు.

Share this post with your friends