యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. భక్తులకు గుడ్ న్యూస్. నిరుపయోగంగా విష్ణు పుష్కరిని తిరిగి భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు ఇకపై విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే భాగ్యం కలగనుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో పునర్మించిన విషయం తెలిసిందే. అయితే పదేళ్లుగా ఈ పుష్కరిణిలో స్నానాలను నిలిపివేశారు. దీంతో భక్తులు కొండ కింద ఉండే లక్ష్మీ పుష్కరిణిలో స్నానం సంకల్పం చేసుకుని వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. ఇది కాస్త ఇబ్బందికరంగా మారడంతో భక్తుల కోరిక మేరకు దేవస్థానం అధికారులు తిరిగి విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పాన్ని పున: ప్రారంభిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆలయ ఈవో భాస్కరరావు విష్ణు పుష్కరిణిని అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీ విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించే వారికి ఈవో బంపర్ ఆఫర్ ఇచ్చారు. దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. అయితే స్నాన సంకల్పానికి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ఇక విష్ణు పుష్కరిణి ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు విష్ణు పుష్కరిణిని ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక టికెట్ లేని భక్తులు పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకుని రావొచ్చు.

Share this post with your friends