శని దోషంతో బాధపడుతున్న పార్వతీదేవి వినాయకుడిని ప్రతిష్టించిందట..

కమండల గణపతి గురించి తెలుసుకున్నాం కదా. ఈ కమండల గణపతి కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కేసవే అనే గ్రామంలో కొలువుదీరాడు. ఈయన శని దోషాలను తొలగిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆలయ స్థలపురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పార్వతి దేవి శని దోషం బారిన పడిండట. అప్పుడు ఆమె భూలోకానికి వచ్చి.. మృగవధే అనే ప్రదేశంలో (కేసవే నుంచి 16 కిలోమీటర్ల దూరంలో) తపస్సు చేసింది.

ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే.. శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్దించినదట. అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తిర్దాన్ని సృష్టించాడని పురాణం. ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించి సృష్టించిన తిర్దాన్ని బ్రహ్మ తీర్థం అని పిలుస్తారు. కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినది స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.

Share this post with your friends