గోవా ఆధ్మాత్మికకు నెలవు.. ఇక్కడ మంగేశి మందిరం గురించి తెలుసా?

గోవా అంటేనే సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేసి రావడం అని అంతా భావిస్తూ ఉంటారు. నిజానికి ఇక్కడి ప్రకృతి అందాలు దేశవిదేశాల్లోని వారందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రాశస్త్యం కలిగినది. గోవా అంటే చాలా చిన్న రాష్ట్రం. ఈ చిన్న రాష్ట్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయని కొద్ది మందికే తెలిసి ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు పరమ శివుడు ప్రతిష్టించిన శ్రీమంగేశి మందిరం ఉంది. ఆది శంకరుల గురువు గోవిందపాదులకు గురువైన గౌడపాదచార్యుల ఆశ్రమం కూడా ఉంది.ఇక మంగేశి మందిరం గురించి స్థల పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం.

ఒకసారి కైలాసంలో శివపార్వతులు ఆటలాడగా.. అమ్మవారి చేతిలో శివయ్య ఓడిపోయాడట. దీంతో శివయ్య గోవా ప్రాంతానికి వచ్చి నివాసించడం ప్రారంభించారట. శివయ్య ఎటు వెళ్లాడో తెలియక పార్వతీ మాత వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చిందట. పార్వతీ మాతను చూసిన వెంటనే శివయ్య పులిగా మారి అమ్మ ముందుకు వచ్చాడట. సడెన్‌గా పులిని చూసిన అమ్మవారు షాక్ అయిందట. వెంటనే తేరుకుని ‘త్రాహి మాం గిరీశ ( పర్వతాలకు ప్రభువైన దేవా తనను రక్షించు)’ అని ప్రార్థించిందట. వెంటనే ఈశ్వరుడు పులి రూపం చాలించి తన పూర్వ రూపంలోకి రావడంతో అమ్మవారు అమితానంద భరితురాలైందట. మాం గిరీశీ అన్న పదమే కాలక్రమంలో మంగేశ్‌గా మారింది. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వినాయక, భైరవ, ముక్తేశ్వర్‌, గ్రామదేవత శాంతేరి, దేవి భగవతి.. తదితర దేవుళ్లు కొలువుదీరారు.

Share this post with your friends