అగ్నిపర్వతం అంచున వినాయకుడు.. ఎక్కడంటే..

వినాయకుడి విగ్రహాలు మన దేశంలో అయితే ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. అలాగే వేరే ఇతర దేశాల్లో ఉండవా? అంటే కొన్ని దేశాల్లో ఉంటాయి. ఓ దేశంలో అగ్ని పర్వతం అంచున వినాయకుడు కొలువుదీరాడు. ఏంటా దేశం? దాని విశేషాలేంటి? అంటే… అది ఇండోనేషియా. అక్కడి మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం అంచున గణేశుడు కొలువుదీరాడు. ఈ విగ్రహం ఒక విశిష్టతను కలిగి ఉంది. అదేంటంటే.. అక్కడి టెంగర్ తెగ వాసులు ఈ వినాయకుడిని 700 ఏళ్లుగా పూజిస్తున్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ వినాయకుడు వెరీ వెరీ స్పెషల్‌గా మారాడు.

ఇండోనేషియాలోని గణేశుడి విగ్రహం ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. విఘ్నాలకు అధిపతి అయిన ఈ వినాయకుడు అగ్నిపర్వతం అంచున కొలువుదీరాడు కాబట్టి.. తమ గ్రామాలను అగ్నిపర్వతం నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రక్షించాలని కోరుకుంటూ ఇక్కడి ప్రజలు పూజలు నిర్వహిస్తారు. ఇక వినాయక చవితి నాడు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. సోషల్ మీడియాలో సైతం ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నారు. స్థానికులు అయితే సమయం దొరికినప్పుడల్లా ఈ వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

Share this post with your friends