జిల్లేడు చెట్టు వేరులో గణపతి.. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే..

విఘ్నాలు తొలగించే వినాయకుడికి ముందుగా నమస్కరించుకోకుండా ఏ పని కూడా మొదలుపెట్టం. అలాగే ఏ పూజా ప్రారంబించము. అలాంటి వినాయకుడికి ఆర్క పత్రం అంటే జిల్లేడు ఆకులు చాలా ఇష్టం. వినాయకచవితి నాడు తప్పనిసరిగా పూజలో జిల్లేడు ఆకులను వినియోగిస్తాం. అలాగే తెల్ల జిల్లేడుతో తయారు చేసిన గణపతి ప్రతిమను మన ఇంటికి తెచ్చుకుని పూజించుకుంటాం. ఇలాంటి జిల్లేడు చెట్టు వేరులోనే వినాయకుడు వెలిస్తే ఆ స్వామిని ఎంత మహిమాన్వితుడిగా చూస్తామో ప్రత్యేకంగా చెప్పాలా?

జిల్లేడు చెట్టు వేరులో గణపతి.. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే..
జిల్లేడు చెట్టు వేరులో గణపతి.. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే..

పురాణాల ప్రకారం శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడును సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అలాంటిది తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేటలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తెల్ల జిల్లేడు చెట్టు మూలమే గణపతి ఆకృతిలో ఏర్పడడం విశేషం. దీంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి విఘ్నేశ్వరుడిని శ్వేతార్క గణపతిగా పిలుస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ గణపతికి ప్రతిరూపంగా భావిస్తున్న.. గణేశుడే స్వయంగా వెలిసిన శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరుకు వంద సంవత్సరాలు దాటాయని చెబుతారు. ఒక జిల్లేడు చెట్టుకు అన్ని ఏళ్లంటే అంతకు మించిన విచిత్రం మరొకటి ఉంటుందా..

Share this post with your friends