ఏటేటా గణపతి పెరుగుతూనే ఉంటాడట..

చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఈ విఘ్నేశ్వరుడి ప్రతిమ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ బిక్కవోలు వినాయకుడు ప్రతి ఏటా పెరుగుతూ ఉంటాడట. ఈ విషయాన్ని స్వయంగా స్థానికులుల చెబుతారు. స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలడం లేదట. ఇదే ఆయన పెరుగుతుంటాడనడానికి నిదర్శనమని చెబుతున్నారు. బిక్కవోలు గణపతి గర్భాలయం లోపలికి భక్తులను అనుమతిస్తారు. ఇక్కడ భక్తులను గర్భాలయంలోకి అనుమతిస్తారు. కాబట్టి స్వయంగా భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకోవచ్చు.

స్వయంగా షావుకారికి కలలో కనిపించి వినాయకుడు తన చెవిలో కోరిక చెబితే తీరుస్తానని చెప్పాడట. ఈ ప్రాంతానికి చెందిన ఒక షావుకారు కలలోకి ఒకసారి వినాయకుడు వచ్చాడట. ‘నీ కోరికలు ఏమున్నా తీరుస్తా.. నా చెవిలో చెప్పు’ అన్నాడట. అలా చెప్పిన మరుసటి రోజే అతని కోరిక నెరవేరిందట. అప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారని చెబుతారు. ప్రతి ఏటా వినాయక చవితి ముందు రోజు భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పిస్తారు. గణపతి ఆలయంలో 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా స్వామివారి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Share this post with your friends