గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం.. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే..

ఆధ్యాత్మికతకు నెలవైన భారతదేశంలో అద్భుతాలకు కొదువ లేదు. ప్రతి ఆలయం ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇప్పటికీ సైన్స్ ఛేదించలేని రహస్యాలు మన దేశంలోని ఆలయాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఉంది. మనం ఏ ఆలయం లేదంటే ఇంట్లో దీపాలను నూనెతో వెలిగిస్తాం. మరి నీటితో వెలిగిస్తే వెలుగుతాయా? సాధ్యమే కాదు కదా.. కానీ ఈ ఆలయంలో మాత్రం దేదీప్యమానంగా వెలుగుతాయి. మరి ఆ ఆలయం షాజాపూర్ జిల్లాలో ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

నీటితో దీపాలు వెలిగించే ఆలయం శాస్త్రవేత్తలకు సైతం సవాలుగానే మారింది. ఇక్కడ నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారం కాదిది. వందల ఏళ్లుగా ఈ ఆలయంలోని దీపాలు నీటితోనే వెలుగుతున్నాయి. ఈ ఆలయం షాజాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కి.మీ దూరంలో నల్ఖేడా సమీపంలో ఉంది. ఆలయాన్ని గడియాఘాట్ వలీ మాతాజీ అని పిలుస్తారు. కాళీసింధ్ నది ఒడ్డున వలీ మాతాజీ కొలువై ఉంది. ఈ ఆలయంతో ప్రతి రోజూ సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు. ఉదయం అవగానే ఈ దీపాలు వాటంతట అవే ఆరిపోతాయి. తిరిగి సాయంత్రం ఆ దీపాలను నీటితో మళ్ళీ వెలిగిస్తారు.

Share this post with your friends