జూలై 21న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న ఆదివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఇలా పౌర్ణమి రోజున సర్వాలంకార భూషితుడైన స్వామివారిని ఆలయ మాఢ వీధుల్లో విహరించడం జరుగుతూ ఉంటుంది.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగ భక్తకోటికి తెలియజేశాడు. ఇలా గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

Share this post with your friends