రాఖీ పండుగ రోజు నుంచి వీరికి బాగా కలిసొస్తుందట..

రాఖీ పండుగ రోజు అంటే ఈ నెల 19న మరో యాధృచ్చికం కూడా ఏర్పడనున్న విషయం తెలిసిందే కదా. ఇక మరికొన్ని యోగాలు కూడా రూపొందనున్నాయి. శ‌శ రాజ్య యోగం, బుధాదిత్య రాజ‌యోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, విష రాజయోగం, కుబేర యోగం వంటి యోగాలు ఇదే రోజున ఏర్పడనున్నాయి. ఆ రోజున బ్లూమూన్ ఏర్పడనుంది. ఒక నెలలో రెండు పౌర్ణమిలు వస్తే రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌గా పిలుచుకుంటామని ముందుగానే చెప్పుకున్నాం. ఇక ఈ రోజున చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

అలా ప్రవేశించిడం వలన 6 రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది. ఈ రాఖీ పండగ నుంచి మేషం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రాశుల వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతోందట. ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారట. ఇక ఊహించని ధనలాభాలు కూడా పొందే అవకాశం ఉందట. కుటుంబంలోనూ వాతావరణం సంతోషకరంగా మారిపోతుందట. మొత్తానికి రాఖీ పండుగ రోజు నుంచి పై రాశుల వారికి బాగా కలిసొస్తుందట.

Share this post with your friends