గోవర్థన పూజను మనం ఈ ఏడాది నవంబర్ 2వ తేదీన జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా.. అసలు ఈ గోవర్తన పూజను ఎలా చేయాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి శుచిగా స్నానం చేసిన మీదట ఆవు పేడను తీసుకొచ్చి దానితో గోవర్థన పర్వతంతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహాన్ని తయారు చేయాలి. ఆ విగ్రహాన్ని పూలు, రంగులతో అలంకరించాలి. ఆ తరువాత పూజ నిర్వహించి కన్నయ్యకు నీటితో పాటు ధూపధీప నైవేద్యాలను సమర్పించాలి.
ఈ పూజానంతరం కన్నయ్యకు సమర్పించే నైవేద్యం చాలా స్పెషల్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 56 పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. దీనిని చప్పన్ భోగ్ అని పిలుస్తారు. అక్కడితో గోవర్తన పూజ పూర్తవుతుంది. ఆ తరువాత ఆవు, విశ్వకర్మను పూజించాలి ఆ తరువాత మనం తయారు చేసుకున్న గోవర్థన పర్వతం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తే కృష్ణ మంత్రాన్ని జపించాలి. చివరిగా కన్నయ్యకు హారతి ఇచ్చి పూజ ముగించాలి. చిటికెన వేలుతో గోవర్థన గిరిని ఎత్తి గోకుల ప్రజలను రక్షించిన కన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పూజ నిర్వహిస్తారు.